రాప్తాడు: పంపనూరు సుబ్రమణ్యం స్వామి దేవస్థానంలో 30 లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంlo ఆదివారం 12 గంటల 20 నిమిషాల సమయంలో టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పంపునూరు సుబ్రమణ్య స్వామి వారి ఆలయం నందు భక్తుల సౌకర్యార్థం 30 లక్షల స్వచ్ భారత్ మిషన్ నిధులతో 22 టాయిలెట్స్ నిర్మాణానికి పనులను ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పంపనూరు సుబ్రమణ్య స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.