తుని ప్రభుత్వఆసుపత్రిలో తాగుబోతు వీరంగం కన్నపిల్లను పీక పట్టుకుని గాలిలోకి లేపిన తాగుబోతు పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది
Tuni, Kakinada | Sep 17, 2025 తుని పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మద్యం సేవించి ఒక భర్త వీరంగం సృష్టించాడు.తాను కన్న చిన్నారిని భార్య వడిలోంచి అతి కిరాతంగా పీక పట్టుకుని గాలిలోకి లేపడం వంటి చేష్టలు చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు అతనికి బుద్ధి చెప్పారు. మరల అరగంటది తర్వాత అదే సీన్ రిపీట్ చేయడంతో అతని తరిమేశారు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి సిబ్బంది మాత్రం కన్నెత్తి చూడలేదు