సాంబవరం గ్రామం జడ్పీ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించిన ఈగల్ టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పరిధిలోని సాంబవరం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో ఈగల్ టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బృందం పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై వివరించి ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.