హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము : తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి
జూబ్లీహిల్స్ లో తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 139 ప్రాంతాలలో 407 పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేశామని, 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వద్ద సీఆర్పీఎఫ్ తో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటిసారి డ్రోన్లను వినియోగించి పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 1950 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.