ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, బివి రాముడు తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.