జమ్మలమడుగు: జమ్మలమడుగు : భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - సిఐటియు నాయకులు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు రాజీవ్ కాలనీలో బుధవారం సిఐటియు నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఏసుదాస్, దాసరి విజయ్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. జమ్మలమడుగులోని లేబర్ ఆఫీసును ప్రొద్దుటూరుకు తరలించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.అనంతరం రాజీవ్ కాలనీలో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.