నారాయణపేట్: వాహన డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: మక్తల్ సీఐ రామ్ లాల్
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అదేశాల మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ లాల్ ఆధ్వర్యంలో బుధవారం ఆటో జీపు బొలెరో మరియు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహన డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ ఇటీవల కొన్ని ప్రాంతాలలో వాహనాలు కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఘటనలు గమనించామని అలాంటి చర్యలు డ్రైవర్లకు ప్రయాణికులకు ప్రాణ హానికరమని హెచ్చరించారు. ప్రతి డ్రైవరు రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని వాహనాలకు సరైన మెయింటెనెన్స్ చేయాలని ఓవర్ లోడ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు.