చేగుంట: నార్సింగి మండల వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు జాతీయ జెండాలు ఎగరవేశారు
Chegunta, Medak | Sep 17, 2025 ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా నార్సింగి మండల వ్యాప్త ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంతో పాటు నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, పోలీస్ స్టేషన్ లో ఎసై సృజన, రైతు వేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి విజృంభణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవికుమార్, ఐకేపీ భవనంలో మండల సమైఖ్య అధ్యక్షురాలు అనిత, శేరిపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వీరేందర్, మండల పరిధి గ్రామాల లోని పంచాయితీ కార్యాలయాలలో కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేశారు.