ఆదోని: ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు : డీఎస్పీ హేమలత
Adoni, Kurnool | Sep 17, 2025 గణేశ్ నిమజ్జన కార్యక్రమాల్లో ఆదోని మండలం పెసలబండకు చెందిన తెలుగు సురేశ్ (16) హెడ్ కానిస్టేబుల్ షేక్ సాబ్పై కర్రతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై DSP హేమలత దర్యాప్తు చేసి కేసు వివరాలను వివరించారు. బుధవారం సురేశ్‌ను పత్తికొండ కోర్టులో హాజరుపరచామని, రిమాండ్ విధించడంతో జిల్లా సబ్ జైలుకు తరలించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.