పటాన్చెరు: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన నాగ కిరీటి (29) భార్య శిరీష (25) నివసిస్తున్నారు. కుటుంబ కలహాలతో భర్త భార్యను మందలించడంతో మనస్థాపం చెంది ఇంటి నుంచి ఈ నెల 25న విడిచి వెళ్ళింది. దీంతో భర్త చుట్టుపక్కల బంధువుల వద్ద ఆమె ఆచూకీ వెతకగా లభించకపోవడంతో పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.