విశాఖపట్నం: మోడీ జన్మదిన సందర్భంగా నగరంలో వై ది శిబిరం ప్రారంభించిన డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బీజేపీ,కేఎన్నార్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు నిర్వహణలో సేవా పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు,పనితీరును ప్రసంసిస్తున్నాయని తెలిపారు. దేశ విదేశాలలో మోడీ పేరు చెప్పగానే భారతదేశం అంటే గౌరవం ఏర్పడేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు.