పల్నాడు జిల్లా,ధరణికోటలో సినీనటి మంచు లక్ష్మి సందడి
పల్నాడు జిల్లా,అమరావతి మండలం ధరణికోటలో బుధవారం డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభం కార్యక్రమంలో "టీచ్ ఫర్ చేంజ్"అధినేత సినినటి మంచు లక్ష్మి, MLA భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా అమరావతి మండలంలో పది స్కూల్స్ కు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.పల్నాడు జిల్లాలో 605 మంది విద్యార్థులకు చేయూత అందిస్తున్నామని,టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించామని తెలిపారు.ఇంగ్లీష్ భాష నేర్చుకుంచే విద్యార్థులు ఏదేశంలో అయినా రాణించవచ్చునన్నారు.