సెట్టూరు మండలం లక్ష్మణ్ పల్లి గ్రామంలో శనివారం జనసేన పార్టీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టెంకాయలు కొట్టారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలు చేశారు. అందరూ అంబేద్కర్ ను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.