ఎమ్మెల్యే సారు ఈ బ్రిడ్జి కాస్త పట్టించుకోండి వేములవాడ ప్రజలు
కరప మండలం వేములవాడ నుంచి పోలినటి వారి పేటకు వెళ్లే వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకుందని ప్రయాణికులు తెలుపుతున్నారు. రెండు వైపులా రైలింగ్ కూలిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయని వాపోతున్నారు వర్షం వస్తే ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వంతెన మరమ్మత్తులు ఎన్నికల హామీగానే మిగిలిపోయాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించి తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు