ఆందోల్: రాయికోడు మండల ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించాలి: ఎస్సై చైతన్య కిరణ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని డిసెంబర్ 17వ తేదీ వరకు కూడా అమలులో ఉంటుందని రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలని, 50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకువెళ్లరాదని తీసుకు వెళ్లినా కూడా సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. అలాగే సభలు సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.