కుందుర్పి మండల కేంద్రంలో గత కొన్ని ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో మురుగు నీరంతా రోడ్లపైకి అటు నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్తున్నది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు శుక్రవారం గ్రామస్తులతో కలిసి మురుగునీరు రోడ్లపై, ఆసుపత్రిలో చేరిన విషయాన్ని గమనించారు. వెంటనే పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు ఫోన్ చేశారు. త్వరలోనే ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి తనకు అందజేయాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.