ఉయ్యూరులో ఇళ్ల దొంగ అరెస్ట్
Machilipatnam South, Krishna | Sep 17, 2025
ఉయ్యూరులో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ జిలానీ (22) అనే యువకుడిని ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఓ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా జిలానీని పట్టుకున్నట్లు సీఐ రామారావు తెలిపారు. ఈ దొంగతనాల్లో జిలానీకి సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.