పటాన్చెరు: శిశుమందిర్ పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా సామూహిక గీతాలాపన : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
పటాన్ చెరులోని శశుమందిర్ పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావి భారత పౌరులకు వందేమాతరం గీతం యొక్క స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు