సెట్టూరు మండలం లక్ష్మణ్ పల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోయా డాన్స్ ప్రదర్శించి అందరినీ ఎంతగానో అలరించారు. కోయా డాన్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్ఎం గోవిందరాజులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి రాజగోపాల్, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.