ఇబ్రహీంపట్నం: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ పైనుంచి దూకి యువతీ మృతి
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగులో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్యని యువతి తను నివసిస్తున్న అపార్ట్మెంట్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.