కడప జిల్లా కడప నగరంలోని రిమ్స్ హాస్పిటల్లో బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.ఈ సమావేశంలో రిమ్స్ అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాల అందుబాటు, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.