కళ్యాణదుర్గం మండలం మంగళ కుంట గ్రామంలో యువ రైతు కురుబ త్రివేంద్ర (31) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. త్రివేంద్ర తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని తనువు చాలించాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.