గుత్తి పట్టణంలోని కటిక బజారు లో నివాసముండే ఎక్కల కుమార్ కుమారుడు ఎక్కల వర్షిత్ అదృశ్యమయ్యాడు. ఎక్కల వర్షిత్ గుత్తిలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం నుంచి కనిపించడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. తన కుమారుడి అదృశ్యమయ్యాడని ఎక్కల కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.