సంగారెడ్డి: పదో తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించేలా చూడాలి: సంగారెడ్డిలో విద్యాధికారి వెంకటేశ్వర్లు
ఈ ఏడాది పదవ తరగతి , ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు వచ్చేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సంగారెడ్డి సమగ్ర శిక్ష కార్యాలయంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఇంటర్లో తక్కువ ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.