ఇబ్రహీంపట్నం: మాగంటి సునీత మూడు రోజులుగా సానుభూతి కోసం అనవసర అరోపణలు చేస్తున్నారు :మంత్రి పొన్నం ప్రభాకర్
మాదాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మూడు రోజులుగా సానుభూతి కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓటర్లు ఇస్తాను సారంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.