విశాఖపట్నం: ఇంటి నుండి తప్పి పోయిన పాలకొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు ఆయన సోదరికి అప్పగించారు
పాలకొండ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి సపర్యలు చేసి, మానసిక వైద్యాలయంలో చికిత్స అందజేసి విశాఖ రెడ్ క్రాస్ సిబ్బంది మన్ననలు పొందారు. పిదప వివరాలు సేకరించి ఆయన్ను క్షేమంగా తన సోదరికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు స్థానికులు పెదవాల్తేరులోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్ క్రాస్ హోంలెస్ షెల్టర్ నిర్వాహకులకు సమాచారమందజేశారు. దీంతో పోలీసుల సాయంతో షెల్టర్ మేనేజర్ మురళీ సారధ్యంలో సదరు వ్యక్తిని నిరాశ్రయ గృహానికి తరలించారు. అతడి వద్ద లభ్యమైన ఆధారాలతో వివరాలు ఆరా తీశారు.