ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని కోరుతూ ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డికి విద్యావంతులు మేధావుల వేదిక తొలి అభ్యంతర పత్రాన్ని అందజేశారు. దొనకొండ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాలో కలిపి సమగ్ర రూపం తేవాలని విన్నవించారు. డిసెంబర్ 25వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీల వారు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు