గంగాధర: మధుర నగర్ లో ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్న నారాయణపూర్ నిర్వాసితులు
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,నారాయణపూర్ మంగపేట గ్రామస్తులు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు మహిళలు మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో చొప్పదండి MLA మేడిపల్లి సత్యం ను మంగళవారం 6:30 PM కి కలిసి తమ సమస్యలను తెలిపారు,నారాయణపూర్ నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటికే 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని,త్వరలోనే ఆ పరిహారం నిర్వాసితులకు అందజేస్తామని తెలిపారు,ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు,ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దన్నారు,