జనగాం: ప్రశ్నాపత్రాల రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలి:జిల్లా విద్యాశాఖ అధికారి,అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
ప్రశ్నాపత్రాల రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి,అదనపు కలెక్టర్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (DCEB) ఆధ్వర్యంలో ఎస్.ఎ–1 ప్రశ్నాపత్రాల తయారీతో పాటు ధృవీకరణ, నిర్ధారణ విషయమై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖాధికారి & అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఖచ్చితత్వం పాటించాలని, పాఠ్యాంశాల సంపూర్ణత, విద్యార్థుల స్థాయికి తగిన కఠినత ఉండాలని సూచించారు.రహస్యత అత్యంత ముఖ్యమన్నారు.