జమ్మలమడుగు: కమలాపురం : పట్టణంలోని కొత్తగా కట్టిన బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం... తప్పిన ప్రమాదం
కడప జిల్లా కమలాపురంలోని కడప తాడిపత్రి రహదారి కొత్తగా కట్టిన బ్రిడ్జి దగ్గర బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.కడప నుండి అనంతపురం వెళుతున్న టయోటా ఇటియోస్ కారు కడప నుండి కొత్తగా కట్టిన బ్రిడ్జి పైన వస్తూ ఉండగా బ్రిడ్జికి వాహనాలు రాకుండా అడ్డముగా పెట్టిన ఇనుప కమ్మీలను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం. కొత్తగా కట్టిన బ్రిడ్జికి ఉదయం వాహనాలు వెళ్లడం. రాత్రి సమయానికి ఇనుప కడ్డీ లు మూసివేయడంతో ప్రమాదం జరిగిందని కార్ డ్రైవర్ చెబుతున్నారు.