అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు రావద్దని సూచించిన అధికారులు,పోలీసులు
అశ్వారావుపేట సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు ఎవరూ రావద్దని ఆలయ అధికారులు, పోలీసులు మంగళవారం తెలిపారు.. భారీ వర్షాల కారణంగా ఆలయం వద్ద వాగులు, వంకలు పొంగి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గేంత వరకు ఆలయం వద్దకు రాకుండా భక్తులు సహకరించాలని కోరారు.