ఇబ్రహీంపట్నం: నందిగామ లోని కెమికల్ పరిశ్రమ ముందు కార్మికుడి మృతితో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
నందిగామ లోని ఓ కెమికల్ పరిశ్రమ ముందు కార్మికుడి మృతితో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బాలయ్య కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని తరచూ శ్వాస కోస వ్యాధితో బాధపడేవాడని తెలిపారు. ఆసుపత్రికి తరలించగా పరిశ్రమలోని కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మరణించాడు అని తెలిపారు. దీంతో కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కెమికల్ పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు.