హిమాయత్ నగర్: కాచిగూడ డివిజన్లో 10 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
కాచిగూడ డివిజన్లోని మౌలానా అజాజ్ నగర్ బస్తీలోని బస్తీ దావకానలో పది లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ పాల్గొన్నారు.