సత్య సాయి జిల్లా హిందూపురంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి ( ఓ పి డి ఆర్) రాష్ట్ర కార్యదర్శి, R. రామ్ కుమార్, అడ్వకేట్.రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం,లేపాక్షి మండలాలలో ప్రభుత్వం పరిశ్రమల కోసమని భూ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీలు, భూ సేకరణ చేస్తున్న గ్రామాలలో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుందామని ప్రభుత్వ అభిప్రాయాలను రైతులకు వివరించామని తెలిపారు