మార్కాపురం: ఆర్టీసీ బస్టాండులో తప్పిపోయిన గుర్తు తెలియని పాపను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ లో గుర్తు తెలియని పాప తప్పిపోయింది. ఆ పాపను హోంగార్డు కాశయ్య పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పాప కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో బోడపాడు కు చెందిన పాప హేమా ప్రియను మేనమామ శ్రీరామ్ నరసింహారావుకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు