గుంటూరు: చంద్రబాబు పీపీపీ విధానాన్ని తప్పుబట్టిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Guntur, Guntur | Sep 17, 2025 గత వైసిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం నగరంలోని కొత్తపేటలో గల మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు లతో కలిసి నారాయణ మాట్లాడారు ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు చెప్పే పీపీపీ విధానం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు.