అలంపూర్: జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగినది.జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ & మహాత్మా గాంధీజీ & జయశంకర్ గార్ల చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ...దేశానికి 1947 లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం పాలకుల కబంధ హస్తాల్లో బందీ అయి ఉన్న మన తెలంగాణ , హైదరాబాద్ నవాబుల చేతులలో నుండి ఆపరేషన్ అపోలో ద్వారా విముక్తి పొంది స్వేచ్చా వాయువులు పీల్చుకుందని తెలిపారు.