ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలను అడగరని ఈ విషయాన్ని ఎవరు కూడా నమ్మవద్దని అన్నారు. బ్యాంక్ అధికారుల పేరిట ఎవరైనా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే ఓటిపి నంబర్ లేదా ఇతర వివరాలు వెల్లడించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నెరగాల బారిన పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.