నారాయణపేట్: ఆశ అత్యాశలే సైబర్ నేరగాళ్ళ ఆయుధాలు: ఎస్పీ డాక్టర్ వినీత్
విలాసవంతమైన వస్తువులు ఇస్తామని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని విదేశీ యాత్రలకు పంపుతామని రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి మరి కొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అధిక మొత్తంలో డబ్బులు తిరిగి వస్తాయని ప్రజలను మభ్యపెట్టి కొత్త కొత్త టెక్నికల్లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని ఇలాంటి నూతన స్కీముల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ప్రకటనలో తెలిపారు.