వర్ని: గౌడ కులస్తులపై దాటికి నిరసనగా గోవూరులో ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం నాయకుల నిరసన
మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గౌడ సంఘం నాయకులు ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం 11 గంటలకు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామస్తులు దాడి చేయడం పట్ల నిరసనగా గోవురులో గౌడ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలరాజు స్వామి, నరేష్, సాయికుమార్, అనిల్ పాల్గొన్నారు.