అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదిగవి గ్రామంలో సోమవారం "ఎన్టీఆర్ భరోసా పథకం" కింద స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసారు గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పింఛన్ల పంపిణీని ప్రతినెల 1వ తారీఖున పంపిణీ చేస్తూ పించన్ దారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.