కళ్యాణదుర్గం లోని కంబదూరు రోడ్డులో శుక్రవారం అగ్నిమాపక కేంద్రం నూతన భవనానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు అగ్నిమాపక అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నాలుగు దశాబ్దాల కలను తాము నెరవేరుస్తున్నామన్నారు. అగ్నిమాపక భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు నిధులు మంజూరు అయ్యాయన్నారు. త్వరలోనే అగ్నిమాపక భవన నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామన్నారు.