సంగారెడ్డి: సంగారెడ్డిలో మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి.ప్రావిణ్య
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయంలో మీడియా సెంటర్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఏంసి )ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య మరియు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలని ఎంసీఎంసీ విధుల నిర్వహణ సంబంధించిన ఏర్పాటులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా తెలియజేయాలని తెలిపారు