మెదక్: అప్పుల బాధ భరించలేక రైతు ఊరి వేసుకొని ఆత్మహత్య
Medak, Medak | Sep 17, 2025 అప్పుల బాధ భరించలేక రైతు తన సొంత వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న శంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన దేవసత్ రవి 45సం తన ఇంటి నిర్మాణానికి ఐసిఐసి బ్యాంకులో తన పొలాన్ని తనకంటూ పెట్టి అప్పు తెచ్చుకొని ఇంటి నిర్మాణం పిల్లర్ల వరకు నిర్మించారు. కాగా ఇంటి అవసరాలు, వ్యవసాయానికి పెట్టుబడులతో మొత్తం ఐదు లక్షలు అప్పు అయినట్లు కుటుంబీకులు తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనతో బాధపడుతూ ఉండేవారని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.