కరీంనగర్: జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై కొడిమ్యాల మండలం పూడూర్ శివారులో రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై కొడిమ్యాల మండలం పూడూర్ శివారులో బుధవారం ఉదయం 11గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ కారు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు గాయపడగా, వారిని కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు ను కారు వెనుక నుండి ఢీకొట్టడం కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పై స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ రహదారి తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.