బౌడారాలో జిందాల్ యాజమాన్యం చేస్తున్న భూదోపిడి అరికట్టాలని నిర్వాసితుల నిరసన
Vizianagaram Urban, Vizianagaram | Sep 17, 2025
జిందాల్ యాజమాన్యం చేస్తున్న భూదోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్నం ఎస్ కోట మండలం బౌడరా లో జిందాల్ నిర్వాసితులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ మాట్లాడుతూ, జిందాల్ భూ సేకరణలో ఎటువంటి చట్టాలు అమలు చేయనందున తీసుకున్న భూమిని వెంటనే భూమి కోల్పోయిన పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.