ఖైరతాబాద్: నగరంలో డ్రగ్స్ కేసులో 50 మంది అరెస్టు
డ్రగ్స్ ఆపరేషన్‌లో కీలక విషయాలను తెలంగాణ ఈగల్ పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులతో కలిసి ఈగల్ బృందం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా.. డ్రగ్స్ ప్రధాన సూత్రధారిని నైజీరియా వాసి నిక్‌గా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికీ 50 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. 107 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దాడుల్లో రూ.3.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.