తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు పీడీ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగ సంఘ నాయకులు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు పీడీ కార్యాలయం వద్ద వెలుగు విఓఏల ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ, వి.ఇందిరా తదితరులు మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ను రద్దు చేయాలన్నారు. వివోఏ ల పట్ల రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు.