తాడిపత్రి: వెంకటరెడ్డి పల్లి లో అన్యమత ప్రచారం, క్రైస్తవ మత ప్రచారకులను అడ్డుకున్న బీ జే పీ, వీ హెచ్ పీ నాయకులు
తాడిపత్రి మండలం వెంకటరెడ్డి పల్లి లో శుక్రవారం రెండు బస్సుల్లో క్రైస్తవ మత ప్రచారకులు అన్యమత ప్రచారాన్ని చేపట్టారు. సమాచారం తెలుసుకున్న బీ జే పీ, వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ నాయకులు వెంకటరెడ్డి పల్లికి వెళ్లారు. ప్రచారాన్ని అడ్డుకున్నారు. క్రైస్తవ మత ప్రచారకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అన్యమత ప్రచారం చేయడం నేరమని పోలీసులు క్రైస్తవ మత ప్రచారకులను గ్రామం నుంచి పంపించి వేశారు.