శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఉమాపతి అనే వృద్ధుడికి తగలడంతో ఉమాపతికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్ లో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి క్షతగాత్రుడైన ఉమాపతి అనే వృద్ధుడిని తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఉమాపతి కుటుంబ సభ్యులు బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉమాపతి చౌడేశ్వరి కాలనీ కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు